Cricket News: ఓ చిన్నారి కోసం టిమ్‌ సౌథీ జెర్సీ వేలం

తాజా వార్తలు

Published : 30/06/2021 01:14 IST

Cricket News: ఓ చిన్నారి కోసం టిమ్‌ సౌథీ జెర్సీ వేలం

క్యాన్సర్ బాధిత హోలీబెట్టీకి అండగా నిలిచేందుకే..

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ సీనియర్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ ఓ మంచి పనికోసం ముందుకొచ్చాడు. అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి చికిత్స కోసం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ధరించిన జెర్సీని వేలం వేయనున్నాడు. కివీస్‌ క్రికెటర్లందరూ ఆ టీషర్ట్‌పై సంతకాలు చేయడం గమనార్హం.

ఎనిమిదేళ్ల చిన్నారి హోలీ బెట్టీ 2018 నుంచి న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్‌తో బాధపడుతోంది. అప్పటి నుంచి ఆమె చికిత్స కోసం సౌథీ కష్టపడుతున్నాడు. వీలైన సాయం చేస్తున్నాడు. తాజాగా కివీస్‌ ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని వేలానికి పెడుతున్నాడు.

‘హాయ్‌ గాయ్స్‌, హోలీకి అండగా నిలిచేందుకు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ధరించిన  జెర్సీని వేలం వేస్తున్నాను. ఇందులో వచ్చే డబ్బు మొత్తం బెట్టీ కుటుంబానికి వెళ్తుంది. రెండేళ్ల క్రితం క్రికెట్‌ సామాజిక వర్గం ద్వారా బెట్టీ గురించి నా కుటుంబం తెలుసుకుంది. అప్పట్నుంచి వారికి అండగా నిలిచేందుకు నేను ప్రయత్నిస్తున్నాను’ అని సౌథీ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు.

‘బెట్టీకి మరింత మెరుగైన వైద్యం అవసరమని తెలియడంతో ఆమెకు సాయం చేసేందుకు ఏదో ఒక దారి వెతుకుతూనే ఉన్నాను. ఈ జెర్సీ వేలం ద్వారా బెట్టీ కుటుంబాన్ని ఆదుకోవచ్చని అనిపించింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె వెంటే నా ఆలోచనలు ఉన్నాయి. మీరు వేసే బిడ్‌ చిన్నదైనా పెద్దదైనా అభినందనీయమే’ అని సౌథీ అన్నాడు. రెండేళ్ల నుంచి చికిత్స అందిస్తున్నా బెట్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఆమెకు వైద్యం అందిస్తున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని