INDvsSL: శ్రీలంక ఆటగాళ్ల బృందం ఎంపిక
close

తాజా వార్తలు

Published : 16/07/2021 20:02 IST

INDvsSL: శ్రీలంక ఆటగాళ్ల బృందం ఎంపిక

కొలంబో: టీమ్‌ఇండియాతో తలపడే వన్డే, టీ20 సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు 23 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసింది. శ్రీలంక క్రీడాశాఖ మంత్రి నమల్‌ రాజపక్స నుంచి స్పష్టమైన ఆదేశాలు అందగానే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌లకు దసన్‌ షనకను కెప్టెన్‌గా నియమించింది. గత నాలుగేళ్లలో శ్రీలంక జట్టుకు అతడు పదో కెప్టెన్‌ కావడం గమనర్హం.

ఇంతకుముందు కెప్టెన్‌గా ఉన్న కుశాల్‌ పెరీరా మోకాలి గాయం కారణంగా భారత్‌తో పరిమిత ఓవర్ల ఆటకు దూరమయ్యాడు. మరోవైపు సీనియర్‌ ఆటగాడు ఏంజిలో మాథ్యూస్‌ వ్యక్తిగత కారణాల రీత్యా పక్కకు తప్పుకున్నాడు. ఇక ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరుకున్న లంక జట్టులో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అందులో బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ఫ్లవర్‌ ఒకరు కాగా, డేటా అనలిస్టు నీరోషన్‌ ఉన్నారు. వీరికి తప్పితే ఆటగాళ్లెవరూ వైరస్‌కు గురికాలేదని లంక బోర్డు ప్రకటించింది.

ఎంపిక చేసిన ఆటగాళ్లు: దసన్‌ షనక (కెప్టెన్‌), ధనంజయ డిసిల్వ (వైస్‌ కెప్టెన్‌), అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్స, పాతుమ్‌ నిస్సంక, చరిత్‌ అసలంక, వానిండు హసరంగ, అషెన్‌ బండర, మినోద్‌ భానుక, లాహిరు ఉదార, రమేశ్‌ మెండిస్‌, చామిక కరుణరత్నే, దుష్‌మంత చమీరా, లక్షన్‌ సందకన్‌, అకిల ధనంజయ, షిరన్‌ ఫెర్నాండో, ధనంజయ లక్షన్‌, ఇషాన్‌ జయరత్నే, ప్రవీణ్‌ జయ విక్రమ, అసిత ఫెర్నాండో, కసున్‌ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదాన


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని