అత్యధిక వన్డేల్లో ఓటమి పాలైన జట్టు ఇదే!

తాజా వార్తలు

Published : 03/07/2021 01:17 IST

అత్యధిక వన్డేల్లో ఓటమి పాలైన జట్టు ఇదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక క్రికెట్‌ జట్టు ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓటమి పాలైన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకూ అత్యధిక వన్డేల్లో ఓటమి చవిచూసిన జట్టుగా టీమ్‌ ఇండియా ఉండేది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో లంక టీమ్‌ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు తొలి వన్డేలోనూ 5 వికెట్ల తేడాతో విఫలమైంది. దాంతో ఈ ఫార్మాట్‌లో మొత్తం 428 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఇక వన్డేల్లో భారత విజయశాతం 54.67గా ఉండగా, శ్రీలంకది 47.69గా నమోదైంది. అలాగే పాకిస్థాన్‌ 414 ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా.. భారత్‌, శ్రీలంక జట్లు మరికొద్ది రోజుల్లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని