డబ్బుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు 
close

తాజా వార్తలు

Updated : 26/01/2021 11:19 IST

డబ్బుల కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు 

బెయిర్‌స్టోపై లంక వికెట్‌ కీపర్‌ స్లెడ్జింగ్‌..

ఇంటర్నెటెడెస్క్‌: ఇంగ్లాండ్‌ టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో టీమ్‌ఇండియాతో టెస్టులకు దూరమైన నేపథ్యంలో శ్రీలంక వికెట్‌కీపర్‌ నిరోషన్‌ డిక్‌విల్లా స్లెడ్జింగ్‌ చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌తో.. ఇంగ్లాండ్‌ తలపడే టెస్టుల్లో బెయిర్‌స్టో ఆడటం లేదని, కానీ ఐపీఎల్‌ ఆడతాడని ఎద్దేవా చేశాడు. అది కూడా డబ్బు కోసమేనని విమర్శించాడు. గాలే వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో(28) బ్యాటింగ్‌ చేస్తుండగా లంక కీపర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. అయితే, డిక్‌విల్లా ఇలా అనగానే బెయిర్‌స్టో ఔటవ్వడం గమనార్హం.

ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో సోమవారం ఇంగ్లాండ్‌ 164 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టెస్టు సిరీస్‌ను పర్యాటక జట్టు 2-0తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు నియమాల ప్రకారం ప్రతీ ఆటగాడికి ఏడాదిలో తగినంత విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. పనిభారం ఎక్కువ కాకూడదనే ఉద్దేశంతోనే బెయిర్‌స్టోను భారత్‌తో టెస్టు మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ ఎక్కువ టెస్టులు ఆడాల్సి ఉండడంతో పాటు టీ20 ప్రపంచకప్‌ కూడా ఆడాల్సి ఉంది. అందుకే ఈ సిరీస్‌లో తమ కీలక ఆటగాడిని ఇంగ్లాండ్‌ పక్కనపెట్టింది.

ఇవీ చదవండి..
మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది‌: పంత్‌
‘పంత్ వ్యూహం’ కోహ్లీదేTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని