close

తాజా వార్తలు

Published : 01/11/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయిపై ఆపిన చోటే పంజాబ్‌పై మొదలెట్టిన స్టోక్స్‌

అబుదాబి: చివరి రెండు మ్యాచుల్లో బెన్‌స్టోక్స్‌ అద్భుతమని రాజస్థాన్‌ సారథి స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. వినూత్నమైన షాట్లతో ఫీల్డర్లు లేనిచోట బంతిని పరుగెత్తిస్తాడని పేర్కొన్నాడు. ముంబయి మ్యాచులో ఎక్కడ ఆపేశాడో పంజాబ్‌ పోరులో అక్కడే మొదలుపెట్టాడని ప్రశంసించాడు. యూఏఈలో జరుగుతున్న టీ20 లీగులో తమ జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిందని వెల్లడించాడు. పంజాబ్‌ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత స్మిత్‌ మాట్లాడాడు.

‘ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నాం. మా ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మధ్యలో ఓటములు ఎదురైనా సరైన సమయంలో మేం పుంజుకోవడం సంతోషాన్నిచ్చింది. మేమింకా చేయాల్సింది చాలావుంది. ఎవరు ఔటైతే ఎవరు క్రీజులోకి వెళ్లాలి వంటి అంశాలపై భిన్నమైన ప్రణాళికలు ఉన్నాయి. గత మ్యాచులో రాణించలేదు కాబట్టి బట్లర్‌కు మరోసారి ఐదో స్థానంలో అవకాశం ఇచ్చాం. ముందుగానే విజయం అందుకోవడంతో రన్‌రేట్‌ మెరుగైంది. స్టోక్స్‌ వినూత్నమైన షాట్లు ఆడగలడు. అందుకే అతడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటగాడు. ఆటగాళ్లతో నిత్యం మాట్లాడుతూ వారిలోని అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకురావడం అవసరం. అతడు నిలదొక్కుకుంటే పరుగుల వరద పారించగలడని మాకు తెలుసు’ అని స్మిత్‌ అన్నాడు.

ప్రస్తుతం తామున్న స్థానంలో ఎవరున్నా కోల్పోయేందుకు ఏమీ ఉండదని రాజస్థాన్‌ హీరో బెన్‌స్టోక్స్‌ అంటున్నాడు. ‘ప్లేఆఫ్స్‌ ఆశలు ఇంకా సజీవంగా ఉండటం సంతోషకరం. భారీ సిక్సర్లు బాదేయడం ఆనందకరం. ముంబయిపై ఎలాంటి దృక్పథంతో ఉన్నానో పంజాబ్‌పైనా అదే మనస్తత్వంతో ఆడాను. కొత్త బంతిని చితకబాదాలనే నిర్ణయించుకున్నాను. చివరి మ్యాచ్‌ తర్వాత కాస్త విరామం లభించింది. ఏ బంతిని ఎలా కొడితే బౌండరీకి పోతుందో తెలియదు. బాదడమే పనిగా పెట్టుకున్నా. అదే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలసిపోకూడదనే అంతకుముందు మ్యాచుల్లో నేను బౌలింగ్‌ చేయలేదు’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.