Sunil Gavaskar Team: శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌కు దక్కని చోటు

తాజా వార్తలు

Updated : 08/09/2021 12:46 IST

Sunil Gavaskar Team: శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌కు దక్కని చోటు

(Photo: Virat Kohli Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌కి సమయం దగ్గరపడుతోంది. ఈ మెగాటోర్నీ ఒమన్‌, యూఏఈ వేదికగా అక్టోబరు 17న ప్రారంభం కానుంది.  దీంతో చాలా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. బీసీసీఐ కూడా రెండు మూడ్రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, అంతకంటే ముందే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో తన జట్టును ప్రకటించారు.

ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌ చేయాలని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రికెట్‌ దిగ్గజం ఎంపిక చేసిన జట్టులో శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఓపెనర్లుగా ఎంచుకోగా.. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. రిషభ్ పంత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. పాండ్య సోదరులకు చోటు దక్కింది.

‘అతడు ఆల్‌రౌండర్‌. చాలా అనుభవం ఉన్న ఆటగాడు. ఐపీఎల్‌లో గత కొన్ని సంవత్సరాలుగా రాణిస్తున్నాడు.  అతడు  కచ్చితంగా ఒక స్థానానికి అర్హుడు. పైగా ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌’అని కృనాల్ పాండ్య గురించి గావస్కర్ వివరించాడు.

గావస్కర్‌ భారత టీ20 జట్టు:

రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్‌, రిషభ్ పంత్‌(వికెట్‌కీపర్), హార్దిక్‌ పాండ్య, కేఎల్ రాహుల్‌,కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌(ఫిట్‌నెస్‌ సాధిస్తే), జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యుజువేంద్ర చాహల్‌.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని