Virat Kohli: కోహ్లీ సారథ్యంపై రైనా వ్యాఖ్యలు

తాజా వార్తలు

Published : 12/07/2021 14:50 IST

Virat Kohli: కోహ్లీ సారథ్యంపై రైనా వ్యాఖ్యలు

అతనింకా ఐపీఎల్‌ గెలవలేదు.. మరింత సమయం అవసరం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి వెటరన్‌ క్రికెటర్‌ సురేశ్ రైనా అండగా నిలిచాడు. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ సారథుల్లో ఒకడని పేర్కొన్నాడు. ఐసీసీ ట్రోఫీలు గెలిచేందుకు అతడికి మరికాస్త సమయం కావాలని సూచించాడు. పెద్ద టోర్నీల్లో ఫైనళ్లకు చేరుకోవడం సాధారణ విషయం కాదని వెల్లడించాడు.

‘విరాట్‌ కోహ్లీ నంబర్‌ వన్‌ సారథి. అతడెంతో సాధించాడని రికార్డులే చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అతడు. మీరు ఐసీసీ ట్రోఫీల గురించి అడుగుతున్నారు. అతడింకా ఐపీఎల్‌ టైటిలే గెలవలేదు. అతడికి మరికాస్త సమయం ఇవ్వాల్సిన అవసరముందని నా అభిప్రాయం’ అని రైనా అన్నాడు.

‘ఈ రెండు మూడేళ్లలోనే వరుసగా 2-3 ప్రపంచకప్‌లు ఉన్నాయి. రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక వన్డే ప్రపంచకప్‌ ఉంది. నిజానికి ఇలాంటి టోర్నీల్లో ఫైనల్‌కు వెళ్లడమే కష్టం. కొన్నిసార్లు ఎక్కడో పొరపాట్లు జరుగుతుంటాయి’ అని రైనా అన్నాడు.

టీమ్‌ఇండియాను చోకర్‌ అనేందుకు వీల్లేదని రైనా స్పష్టం చేశాడు. ఇప్పటికే భారత్‌ మూడు ప్రపంచకప్‌లు గెలిచిందని గుర్తు చేశాడు. ‘మనం చోకర్స్‌ కాదు. 1983, 2011 వన్డే ప్రపంచకప్‌లు, 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచాం. ఆటగాళ్లు కఠోరంగా సాధన చేస్తున్నారని మనం గ్రహించాలి. మూడు ప్రపంచకప్‌లు వస్తున్నందున చోకర్స్‌ అనేందుకు వీల్లేదు’ అని వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని