Sushil Kumar: ప్రశ్నిస్తే..పెదవి విప్పడం లేదట!

తాజా వార్తలు

Published : 26/05/2021 14:08 IST

Sushil Kumar: ప్రశ్నిస్తే..పెదవి విప్పడం లేదట!

దిల్లీ: రిమాండులో ఉన్న రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పోలీసులకు సహకరించడం లేదట. వారు అడిగిన ప్రశ్నలకు అతడు సరైన జవాబులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. పదేపదే ప్రశ్నిస్తున్నా పెదవి విప్పడం లేదని సమాచారం. గ్యాంగ్‌స్టర్లతో అతడికున్న సంబంధాలపై అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అతడికి ఆరు రోజుల రిమాండ్‌ విధించింది. ఇందులో భాగంగా పోలీసులు అతడిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. సోమవారం రాత్రంతా జైలులో విలపించిన సుశీల్‌ను మంగళవారం ఛత్రసాల్‌ స్టేడియం, మోడల్‌ టౌన్‌లోని అతడి ఇంటికి తీసుకెళ్లారు. దాడి జరిగిన తీరును పునఃసృష్టి చేసేందుకు ప్రయత్నించారు. ఆధారాలు సేకరించేందుకు ఫొరెన్సిక్‌ నిపుణుల సహాయం తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని