T20 World Cup: ఇండియాXపాక్‌ మ్యాచ్‌ అప్పుడే..

తాజా వార్తలు

Published : 05/08/2021 01:47 IST

T20 World Cup: ఇండియాXపాక్‌ మ్యాచ్‌ అప్పుడే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. ఈ రెండు జట్లు తలపడుతుంటే చూడాలని క్రికెట్‌ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఇరు టీంల మధ్య కొద్ది కాలంగా ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఈ దాయాది జట్లు ఎప్పుడు తలపడుతాయా అని ఆసక్తితో వేచిచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరదించింది రానున్న టీ20 ప్రపంచకప్‌. ఈ ఇరు జట్లను గ్రూప్‌-బిలో చేర్చినట్లు ఐసీసీ గతంలోనే ప్రకటించింది. తాజాగా భారత్‌, పాక్ జట్ల మధ్య మ్యాచ్‌ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 24న ఈ రెండు జట్లు తలపడనున్నట్లు సమాచారం. అన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఈ నెల రెండోవారంలో ప్రకటించనున్నారు. టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఒమన్‌తోపాటు యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే.

గత రెండేళ్లుగా ఇండియా, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఈ దాయాది జట్లు చివరిసారి పోటీ పడ్డాయి. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ సునాయాస విజయం సాధించింది. మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోసారి ఈ ప్రపంచకప్‌లో రసవత్తర పోరు ఖాయమని అంచనాలు పెంచుకుంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని