అడగ్గానే నటరాజన్‌ను ఇచ్చేశారు.. 

తాజా వార్తలు

Published : 11/02/2021 15:02 IST

అడగ్గానే నటరాజన్‌ను ఇచ్చేశారు.. 

బీసీసీఐ కోరికను అంగీకరించిన టీఎన్‌సీఏ

చెన్నై: విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడాల్సిన టి.నటరాజన్‌ను విడిచిపెట్టాలని బీసీసీఐ కోరడంతో తమిళనాడు క్రికెట్‌ సంఘం(టీఎన్‌సీఏ) అందుకు అంగీకరించింది. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా మరికొద్ది రోజుల్లో విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటరాజన్‌ తమిళనాడు తరఫున ఆ టోర్నీలో ఆడాల్సి ఉంది. అయితే, వచ్చేనెలలో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడేందుకు నటరాజన్‌ను టీమ్‌ఇండియా కోసం విడిచిపెట్టాలని బీసీసీఐ తాజాగా టీఎన్‌సీఏను కోరింది.

‘ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు నటరాజన్‌ కావాలని బీసీసీఐ అడగడంతో మేం ఒప్పుకొన్నాం’ అని టీఎన్‌సీఏ సెక్రటరీ రామసామి గురువారం మీడియాకు చెప్పారు. నట్టూ స్థానంలో జగన్నాథ్‌ శ్రీనివాస్‌ అనే ఆటగాడిని తమ జట్టులో చేర్చుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని టీఎన్‌సీఏ చీఫ్‌ సెలెక్టర్‌ వాసుదేవన్‌ కూడా  ధ్రువీకరించారు. కాగా, ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే విజయ్‌ హజారే ట్రోఫీలోనూ మరోసారి సత్తా చాటాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. 

మరోవైపు టీమ్‌ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమిపాలైన కోహ్లీసేన శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఈ టెస్టు సిరీస్‌ అనంతరం.. ఇరు జట్లూ ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నటరాజన్‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. నట్టూ ఇంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో రాణించి అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఒకేసారి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 

ఇవీ చదవండి..

అదే జరిగితే.. కోహ్లీ తప్పుకుంటాడేమో..!

ఆ వ్యాఖ్యలు బాధించాయి: వసీమ్‌ జాఫర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని