ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరినైనా..

తాజా వార్తలు

Published : 20/05/2021 10:50 IST

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎవరినైనా..

టీమ్‌ఇండియా ఓడిస్తుందన్న పుజారా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలోని ఏ జట్టునైనా ఎక్కడైనా ఓడించగలిగే సత్తా తమకుందని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. ఎప్పుడూ లేనంత బలంగా తమ రిజర్వు బెంచి ఉందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ దాడిని గతంలో ఎదుర్కొన్నామని తెలిపాడు. సౌథాంప్టన్‌ తటస్థ వేదిక కావడం ప్రయోజనకరమని వెల్లడించాడు. కరోనా మహమ్మారి కారణంగా సాధనకు తగినంత సమయం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు పుజారా సిద్ధమవుతున్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకూ సన్నద్ధం అవుతున్నాడు. కొన్నేళ్ల తర్వాత అతడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైన సంగతి తెలిసిందే. ఫైనల్స్‌ జరిగే సౌథాంప్టన్‌లో గత సిరీసులో పుజారా 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా చివరి మూడు విదేశీ పర్యటనల్లో ఈ నయావాల్‌ చాలినన్ని పరుగులు చేయలేదు.

‘ప్రస్తుతం పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. ఈ మహమ్మారి సమయంలోనూ ఫైనల్స్‌ ఆడుతుండటం మా అదృష్టం. సాధనకు సమయం దొరకున్నా మాకు చాలినంత అనుభవం ఉంది. నా బ్యాటింగ్ పద్ధతుల్లో మార్పేమీ రాలేదు. రెండేళ్లుగా టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. ఫైనల్స్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ అద్భుతంగా ఉండనుంది. వారి బౌలింగ్‌ దాడిలో సమతూకం ఉంది. గతంలో వారిని ఎదుర్కొన్న అనుభవం మాకుంది’ అని పుజారా అన్నాడు.

‘మా రిజర్వు బెంచీ ఎప్పుడూ లేనంత బలంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లోనూ బ్యాకప్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఆసీస్‌ సిరీసే అందుకు ఉదాహరణ. టీమ్‌ఇండియా పటిష్ఠమైన జట్టు. ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. గత పర్యటనలో మేం ఓడాం. కానీ, మాకు తగినన్ని అవకాశాలు వచ్చాయి. ఇంగ్లాండ్‌లో గెలవగల సత్తా మాకుంది. విదేశాల్లో భారత్‌ ఈ మధ్య బాగా రాణించింది. ఆటగాళ్లంతా అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు’ అని పుజారా తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని