Team India: 10 కాదు 3 రోజులే
close

తాజా వార్తలు

Published : 22/05/2021 10:42 IST

Team India: 10 కాదు 3 రోజులే

కఠిన క్వారంటైన్‌ను తగ్గించిన ఈసీబీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్లకు శుభవార్త! కఠిన క్వారంటైన్‌ ఆంక్షలను ఈసీబీ సడలించింది. బీసీసీఐ చర్చలతో 10 రోజుల కఠిన క్వారంటైన్‌ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే సాధన చేసుకోవచ్చు. సుదీర్ఘ పర్యటన కావడంతో క్రికెటర్ల కుటుంబ సభ్యులూ ఇంగ్లాండ్‌ వెళ్తున్న సంగతి తెలిసిందే. వారికి మాత్రం పది రోజుల కఠిన క్వారంటైన్‌ ఉండనుంది. వీరికీ మినహాయింపు కల్పించేలా బోర్డు వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.

ప్రస్తుతం పురుషులు, మహిళల జట్లు, వారి కుటుంబాలతో సహా ముంబయిలో క్వారంటైన్లో ఉన్నాయి. జూన్‌ 2న రెండు జట్లు ఒకే ఛార్టర్‌ విమానంలో బ్రిటన్‌కు వెళ్తాయి. కోహ్లీసేన నేరుగా సౌతాంప్టన్‌లో దిగి అక్కడి హోటళ్లలో క్వారంటైన్ అవుతుంది. మిథాలీ సేన బ్రిస్టల్‌కు వెళ్లి స్థానికంగా క్వారంటైన్ కానుంది. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ రెండు టెస్టుల సిరీసూ ఇదే సమయంలో జరుగుతుంది. దాంతో కివీస్‌ సభ్యులూ టీమ్‌ఇండియా క్రికెటర్లు ఒకే హోటళ్లలో ఉంటారని తెలుస్తోంది.

మిథాలీ సేన జూన్‌ 16న ఇంగ్లాండ్‌తో ఏకైక టెస్టులో తలపడుతుంది. ఆ తర్వాత 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. మరోవైపు జూన్‌ 18-22 వరకు కోహ్లీసేన, విలియమ్సన్‌ బృందంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో తాడేపేడో తేల్చుకుంటుంది. ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు సిరీసు ఆడుతుంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీసును ముందుకు జరపాలని బీసీసీఐ ఈసీబీతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని