WTC Final: తేనీరు విరామం.. భారత్‌ 120/3
close

తాజా వార్తలు

Published : 19/06/2021 20:11 IST

WTC Final: తేనీరు విరామం.. భారత్‌ 120/3

సౌథాంప్టన్‌: రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి టీమ్‌ఇండియా స్కోర్‌ 120/3గా నమోదైంది. ఈ సెషన్‌లో మొత్తం 27.3 ఓవర్ల పాటు ఆట జరగ్గా, భారత్‌ ఒక వికెట్‌ నష్టపోయి 51 పరుగులు చేసింది. భోజన విరామం అనంతరం పుజారా(8) ఔటయ్యాడు. 40.2 ఓవర్‌కు బౌల్ట్‌ వేసిన ఓ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో జట్టు స్కోర్‌ 88/3గా నమోదైంది. అనంతరం కోహ్లీ (35; 94 బంతుల్లో 1x4), అజింక్య రహానె(13; 54 బంతుల్లో 1x4) నిలకడగా ఆడుతున్నారు. అనవసర షాట్లకు ప్రయత్నించకుండా జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 55.3 ఓవర్ల వద్ద అంపైర్లు తేనీరు విరామం ప్రకటించేసరికి జట్టు స్కోర్‌ 120/3కి చేరింది.

అంతకుముందు టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి సెషన్‌లో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ(34; 68 బంతుల్లో 6x4), శుభ్‌మన్‌గిల్‌(28; 64 బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించాక స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత హిట్‌మ్యాన్‌ జేమీసన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో సౌథీ చేతికి చిక్కగా, మరో పరుగు తర్వాత నీల్‌వాగ్నర్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్ కీపర్‌ వాట్లింగ్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని