WTC Final: తొలి సెషన్‌లో భారత్‌ రెండు వికెట్లు
close

తాజా వార్తలు

Published : 19/06/2021 17:20 IST

WTC Final: తొలి సెషన్‌లో భారత్‌ రెండు వికెట్లు

క్రీజులో కోహ్లీ, పుజారా..

సౌథాంప్టన్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా తొలి సెషన్‌లో రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(6; 12 బంతుల్లో 1x4), చెతేశ్వర్‌ పుజారా(0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు రోహిత్‌శర్మ(34; 68 బంతుల్లో 6x4), శుభ్‌మన్‌గిల్‌(28; 64 బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించాక స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తొలుత హిట్‌మ్యాన్‌ జేమీసన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో సౌథీ చేతికి చిక్కగా మరో పరుగు తర్వాత శుభ్‌మన్.. నీల్‌వాగ్నర్‌ బౌలింగ్‌లో కీపర్‌ వాట్లింగ్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం జోడీ కట్టిన కోహ్లీ, పుజారా మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని