Covid Relief: పాండ్య సోదరులు.. మీరు గ్రేట్‌!
close

తాజా వార్తలు

Published : 25/05/2021 01:21 IST

Covid Relief: పాండ్య సోదరులు.. మీరు గ్రేట్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పోండ్య సోదరులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాళ్లిద్దరూ ఈనెల ఆరంభంలో తమ కుటుంబం తరఫున 200 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం తమకు అందిన కొన్ని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అవసరమైన కొవిడ్ కేర్‌ సెంటర్లకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న కృనాల్‌ పాండ్య ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పాడు.

అలాగే హార్దిక్‌ పాండ్య ట్వీట్ చేస్తూ అందరం కలిసుంటేనే ఈ మహమ్మారిపై  విజయం సాధిస్తామని అన్నాడు. ప్రస్తుతం కరోనాపై యుద్ధంలో మధ్యలో ఉన్నామని, కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించాడు. కాగా, దేశంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పాండ్య సోదరులే కాకుండా పలువురు క్రికెటర్లు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ-అనుష్క దంపతులు రూ.11 కోట్లకుపైగా విరాళాలు సేకరించగా.. హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా, మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి లాంటి వారు సామాజిక మాధ్యమాల ద్వారా వీలైనంత సాయం అందజేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని