బుమ్రా ఊపిరి పీల్చుకునే సమయమివ్వాలి
close

తాజా వార్తలు

Published : 15/01/2021 03:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుమ్రా ఊపిరి పీల్చుకునే సమయమివ్వాలి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు తగిన విశ్రాంతి ఇవ్వాలని, అతడిని బాగా చూసుకోవాలని మాజీ బ్యాట్స్‌మన్‌, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచి అతడు ఏకధాటిగా క్రికెట్‌ ఆడుతున్నాడని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌తో తలపడే అన్ని మ్యాచ్‌ల్లో(4 టెస్టులు, 5టీ20లు, 3 వన్డేలు) అతడిని ఆడించడం సరికాదని తెలిపాడు.

‘బుమ్రా బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీర్ఘ కాలంలో అతడే ప్రధాన పేసర్‌గా టీమ్‌ఇండియాను నడిపిస్తాడు. కాబట్టి అతడు ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఇక రాబోయే ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ఉమేశ్‌, షమి, ఇషాంత్‌ ఫిట్‌గా లేరని తెలుసు. అంత మాత్రాన బుమ్రాని నాలుగు టెస్టుల్లో ఆడించడం సరికాదు. ఇప్పటివరకు అతడు స్వదేశంలో టెస్టు క్రికెట్‌ ఆడనేలేదు. కాబట్టి టీమ్‌ఇండియా అతడి విషయంలో జాగ్రత్తగా ఉందనే అనుకుంటున్నా’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా బుమ్రాను కేవలం విదేశాల్లోనే ఆడించిందని, ఈ పేస్‌గుర్రం అక్కడ తన ప్రతాపం చూపించిందని మాజీ బ్యాట్స్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, బుమ్రా భారత్‌లో అదరగొట్టలేడని తాను అనడం లేదన్నాడు. ఇక్కడ మరింత ప్రమాదకరంగా రాణిస్తాడని చెప్పాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరు క్రీజులో ఉన్నా ఔట్‌ చేయగల సమర్థుడని గంభీర్‌ కొనియాడాడు. ఇదిలా ఉండగా, బుమ్రా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో ఆడడం లేదనే సంగతి తెలిసిందే. అతడికి పొత్తి కడుపులో నొప్పిగా ఉందని తెలిసింది. అతడి స్థానంలో టీమ్‌ఇండియా నటరాజన్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది.

ఇవీ చదవండి..
‘అశ్విన్‌ ఒక్కడే 800 వికెట్లు చేరుకుంటాడు’ 
ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని