WTC Final: టీమ్‌ఇండియా జట్టు ఇదే..
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 19:30 IST

WTC Final: టీమ్‌ఇండియా జట్టు ఇదే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈనెల 18 నుంచి సౌథాంప్టన్‌ వేదికగా ఏజీయస్‌ మైదానంలో టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుంది. ఇందులో భాగంగా బీసీసీఐ కొద్దిసేపటి క్రితం 15 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెతో పాటు ఓపెనర్లుగా రోహిత్‌, శుభ్‌మన్‌గిల్‌ను ఎంపిక చేసింది. అలాగే వికెట్‌ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా ఇద్దరి పేర్లను చేర్చింది. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఐసీసీ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని ప్రవేశపెట్టగా భారత్‌, కివీస్‌ జట్లు తుది పోరుకు అర్హత సాధించాయి.

ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా మొత్తం ఆరు సిరీస్‌ల్లో 17 మ్యాచ్‌ల్లో తలపడింది. అందులో 12 విజయాలు, నాలుగు ఓటములతో పాటు ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. దాంతో 72.2 విజయశాతం సంపాదించి 520 పాయింట్లు దక్కించుకుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ ఐదు సిరీస్‌ల్లో 11 మ్యాచ్‌లు ఆడి.. ఏడు విజయాలు సాధించి, నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలైంది. ఆ జట్టు 70 విజయశాతంతో 420 పాయింట్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు జట్లూ తుదిపోరుకు చేరుకున్నాయి. ఇక శుక్రవారం నుంచి ఫైనల్‌లో తలపడటమే తరువాయి. మరోవైపు న్యూజిలాండ్‌ సైతం ఈరోజే తమ 15 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా గాయపడిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కోలుకోవడంతో ఫైనల్లో నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు.

ఎంపిక చేసిన ఆటగాళ్లు..: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె(వైస్‌ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(కీపర్‌), సాహా(కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని