రిషభ్‌ పంత్‌ గుండెపోటు తెప్పించగలడు.. 
close

తాజా వార్తలు

Published : 02/02/2021 11:58 IST

రిషభ్‌ పంత్‌ గుండెపోటు తెప్పించగలడు.. 

ఊపిరి బిగపట్టేలా చేయగలడు: ఆర్‌.శ్రీధర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, గబ్బా టెస్టు హీరో రిషభ్‌పంత్‌ ఏదైనా చేయగలడని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ అన్నారు. పంత్‌ తన బ్యాటింగ్‌తో గుండెపోటు తెప్పించగలడని, అలాగే ఊపిరి బిగపట్టేలా చేయగలడని చెప్పారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో పంత్‌ చివరి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. సిడ్నీలో 97 పరుగులకు ఔటై త్రుటిలో శతకం చేజార్చుకున్న అతడు గబ్బా టెస్టులో 89* అంతకన్నా విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. డ్రా దిశగా సాగుతుందని భావించిన ఆ మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో భారత్‌.. కంగారూ గడ్డపై రెండోసారి చరిత్ర సృష్టించేలా చేశాడు. 

అయితే, పంత్‌ ఎలాంటి ఆటగాడనే విషయంపై టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ స్పష్టతనిచ్చారు. అతడు ఆల్‌రౌండ్‌ ప్యాకేజీ లాంటోడని కొనియాడారు. క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మాట్లాడిన శ్రీధర్‌.. పంత్‌ను మనం ఎలా చూస్తే అలా కనిపిస్తాడని చెప్పారు. ‘అతడు గుండెపోటు తెప్పించగలడు, గుండె బద్దలయ్యేలా చేయగలడు. అదే సమయంలో ఊపిరి బిగపట్టేలా చేయగలడు. అందర్నీ ఎలా ఆశ్చర్యపరుస్తాడో అలాగే నిరాశపరుస్తాడు. రెండింటినీ సమాన రీతిలో చూపించే శక్తి సామర్థ్యాలున్న ఆటగాడు’ అని శ్రీదర్‌ పేర్కొన్నారు. అలాగే ఆసీస్‌ పర్యటనలో తన కీపింగ్‌ నైపుణ్యాలు మెరుగుపర్చుకోడానికి పంత్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సమయాన్ని వదులుకున్నట్లు చెప్పారు. దాంతో కీపింగ్‌లోనూ మెరగవ్వడానికి కష్టపడుతున్నట్లు వివరించారు. 

ఇవీ చదవండి..
అక్షయ్‌ కుమార్‌తో వావ్‌ అనిపించే గబ్బర్‌ సెల్ఫీ
ఇంగ్లాండ్‌ ఒక్క టెస్టు అయినా గెలుస్తుందనుకోవట్లేదు..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని