Team India: కోహ్లీసేనకు ‘నెగెటివ్‌’ శుభవార్త

తాజా వార్తలు

Updated : 16/07/2021 12:16 IST

Team India: కోహ్లీసేనకు ‘నెగెటివ్‌’ శుభవార్త

పంత్‌తో మెలిగిన వారికీ నెగెటివ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాకు శుభవార్త! తాజాగా నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో కోహ్లీసేన మొత్తానికి నెగెటివ్‌ వచ్చిందని సమాచారం. రిషభ్ పంత్‌తో సన్నిహితంగా మెలిగిన వారికీ నెగెటివ్‌ రావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌కు కరోనా వైరస్‌ సోకిందని గురువారం తెలిసింది. అతడితో పాటు త్రోలు విసిరే దయానంద్‌కు పాజిటివ్‌ వచ్చింది. వీరిద్దరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్‌ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ను ఐసోలేషన్‌కు పంపించారు. మిగిలిన వారు డుర్హమ్‌లోని శిబిరానికి బయల్దేరారు.

కోహ్లీసేనకు గురువారం మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించారు. ఇందులో అందరికీ నెగెటివ్‌ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఇకపై ఏడు రోజుల పాటు ప్రతిరోజు పరీక్షలు చేయనున్నారు. ‘ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌ వచ్చింది. కానీ స్థానిక నిబంధనల ప్రకారం సాహా, ఈశ్వరన్‌, అరుణ్‌ లండన్‌లోని హోటల్‌లోనే బస చేస్తారు.  మిగతా వారితో డుర్హమ్‌కు వెళ్లరు. పంత్‌ బాగున్నాడు. ఇంకో 7 రోజులు ఐసోలేషన్‌లో ఉంటాడు. పాజిటివ్‌ వచ్చాక చేసిన రెండు పరీక్షల్లో అతడికి నెగెటివ్‌ రావడం సంతోషకరం’ అని జట్టు వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని