Cricket News: లైంగిక వేధింపుల నివారణకు బీసీసీఐ కొత్త విధానం

తాజా వార్తలు

Published : 21/09/2021 12:35 IST

Cricket News: లైంగిక వేధింపుల నివారణకు బీసీసీఐ కొత్త విధానం

దిల్లీ: క్రికెటర్లపై లైంగిక వేధింపుల నివారణ కోసం బీసీసీఐ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. సోమవారం బీసీసీఐ ఆమోదించిన ఆ విధానం పరిధిలోకి భారత క్రికెటర్లూ వస్తారు. ఇప్పటివరకూ లైంగిక వేధింపుల విషయంలో బీసీసీఐకి ఓ విధానమంటూ లేదు. తాజాగా అధికార ప్రతినిధులు, అపెక్స్‌ కౌన్సిల్, ఐపీఎల్‌ పాలక వర్గ కమిటీ సభ్యులు, సీనియర్‌ స్థాయి నుంచి అండర్‌-16 వరకూ క్రికెటర్లు.. ఇలా దాదాపు అందరికీ వర్తించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు నలుగురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీ (ఐసీ)ని ఏర్పాటు చేయనుంది.ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి విచారణ జరిపి ఈ కమిటీ 90 రోజుల్లో తమ నివేదికను బీసీసీఐకి అందించాల్సి ఉంటుంది. దానిపై 60 రోజుల్లోపు బీసీసీఐ నిర్ణయం ప్రకటిస్తుంది. ఫిర్యాదుదారు లేదా ప్రతివాది ఒకవేళ బీసీసీఐ తీర్పుపై అసంతృప్తితో ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు.

ఈసీబీకి రూ.11 కోట్లు: భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నందుకు ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)కు బీసీసీఐ సుమారు రూ.11 కోట్లు    చెల్లిస్తుంది. తమ ఆతిథ్య ఫీజు రూ.99 కోట్ల నుంచి బీసీసీఐ ఈ డబ్బులు అందిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని