Delhi Capitals: కప్పు కొట్టేందుకు యూఏఈకి ఎగిరిపోయిన దిల్లీ ఆటగాళ్లు..

తాజా వార్తలు

Published : 21/08/2021 20:03 IST

Delhi Capitals: కప్పు కొట్టేందుకు యూఏఈకి ఎగిరిపోయిన దిల్లీ ఆటగాళ్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు శనివారం యూఏఈకి తరలివెళ్లారు. ఐపీఎల్‌ 2021 రెండో విడత మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ జట్టులోని భారత ఆటగాళ్లు కొద్ది సేపటి క్రితం ఓ విమానంలో బయలుదేరి వెళ్లారు. స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా, అజయ్‌ రాట్రాతో పాటు సహాయక సిబ్బంది సైతం ఆటగాళ్ల వెంట పయనమియ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను దిల్లీ జట్టు తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకొని అభిమానులకు ఆ విషయం తెలిసింది. కాగా మూడేళ్లుగా నిలకడగా ఆడుతున్న జట్లలో దిల్లీ ఒకటి. ఏడేళ్ల తర్వాత 2012లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు గతేడాది ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, అక్కడ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌తో పోటీపడి త్రుటిలో తొలి టైటిల్‌ను కోల్పోయింది.

ఇక ఈ సీజన్‌లో మే 4న టోర్నీ అర్ధాంతరంగా నిలిచిపోయేసరికి దిల్లీ 8 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి అందరికన్నా ముందు నిలిచింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జరిగే తర్వాతి మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి ప్రదర్శనే చేసి మరోసారి ఫైనల్‌కు వెళ్లాలని చూస్తోంది. ఇదిలా ఉండగా, జట్టు యాజమాన్యం తదుపరి సీజన్‌లో ఎవరిని కెప్టెన్‌గా కొనసాగించాలనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఏప్రిల్‌లో ఈ సీజన్‌ ప్రాంభమైనప్పుడు రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయంబారిన పడటంతో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే, అతడు జట్టును విజయవంతంగా నడిపించడం విశేషం. ఇక ఇప్పుడు అయ్యర్‌ గాయం నుంచి కోలుకోవడంతో రెండో భాగం మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్నాడు. అతడిని మళ్లీ కెప్టెన్సీ చేయనిస్తారా లేక పంత్‌కే ఈ సీజన్‌ మొత్తం బాధ్యతలు అప్పగిస్తారా వేచి చూడాలి. మరోవైపు విదేశీ ఆటగాళ్లు కూడా త్వరలోనే జట్టుతో కలిసే అవకాశాలున్నాయి.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని