DK: అనుమతిస్తే.. ఎందుకు ఆడం!

తాజా వార్తలు

Published : 18/07/2021 01:31 IST

DK: అనుమతిస్తే.. ఎందుకు ఆడం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుమతి లభిస్తే ‘ది హండ్రెడ్‌’ టోర్నీ ఆడేందుకు సిద్ధమేనని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌  కార్తీక్‌ అన్నాడు. ఇతర ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడేందుకు సురేశ్‌ రైనా, రాబిన్‌ ఉతప్ప వంటి క్రికెటర్లు సంసిద్ధత వ్యక్తం చేశారని గుర్తు చేశాడు. ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి సంతోషంగా బీసీసీఐ నిబంధనలు పాటిస్తానని వెల్లడించాడు.

‘అవకాశం ఇస్తే ఎందుకు ఆడం? ఇప్పుడున్న నిబంధనల ప్రకారం మేం ఆడలేకపోతున్నాం. కానీ ఎవరికి తెలుసు? అవి మారతాయేమో!  సురేశ్‌ రైనా, రాబిన్‌ ఉతప్ప వంటి క్రికెటర్లు ఇతర ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నామని చెప్పారు. అయితే ఇప్పట్లో అనుమతి ఇస్తారని మాత్రం అనుకోవడం లేదు’ అని కార్తీక్‌ అన్నాడు.

‘ఏదేమైనా మేం ఎదురు చూడాలి. నాకూ ఇతర దేశాల్లో ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడాలనే ఉంది. ఇప్పుడున్న నిబంధనలతో ఆడలేకపోతున్నా. అయితే వాటిని పాటించడం సంతోషమే. మేం బీసీసీఐ, భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. కాబట్టి వారు ఎలాంటి నిబంధనలు పెట్టినా పాటించాల్సిందే’ అని డీకే తెలిపాడు. ప్రస్తుతం అతడు ఇంగ్లాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీసుకు వ్యాఖ్యానం చేయనున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని