INDvsENG:కోహ్లీసేనకు డీకే బంపర్‌ ఆఫర్‌!

తాజా వార్తలు

Published : 16/07/2021 14:58 IST

INDvsENG:కోహ్లీసేనకు డీకే బంపర్‌ ఆఫర్‌!

కీపింగ్‌కు సిద్ధమని సంకేతాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌  కార్తీక్‌ బీసీసీఐకి ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు! ఇంగ్లాండ్‌ సిరీసులో గ్లోవ్స్‌ ధరించేందుకు సిద్ధంగా ఉన్నానని సూచన చేశాడు. కీపింగ్‌, బ్యాటింగ్‌ కిట్‌ చిత్రాలను ట్వీట్‌ చేశాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తర్వాత టీమ్‌ఇండియాకు మూడు వారాల విరామం ఇచ్చారు. కానీ యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌కు కరోనా సోకింది. దాంతో అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడితో సన్నిహితంగా మెలిగిన మరో వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా సైతం ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. పంత్‌, సాహా, ఈశ్వరన్‌, భరత్‌ అరుణ్‌ మినహా మిగిలిన అందరూ డుర్హమ్‌లోని శిబిరానికి చేరుకున్నారు.

మరికొన్ని రోజుల్లో టీమ్‌ఇండియాకు కౌంటీ ఎలెవన్‌తో మూడు రోజుల మ్యాచ్‌ ఉంది. ఆ తర్వాత అంతర్గత మ్యాచులు మొదలవుతాయి. ఇద్దరు వికెట్‌ కీపర్లు ఐసోలేషన్‌లోనే ఉండటంతో ఈ మ్యాచుల్లో వికెట్లను ఎవరు కాచుకుంటారన్న సందేహాలు ఏర్పడ్డాయి.

కేఎల్‌ రాహుల్‌కు వికెట్‌ కీపింగ్‌ సామర్థ్యం ఉంది. వన్డే, టీ20ల్లో కీపింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టులోపు పంత్‌, సాహా జట్టులో చేరతారనే అంటున్నారు. ఒకవేళ అవసరమైతే తాను సిద్ధంగానే ఉన్నానని దినేశ్‌ కార్తీక్‌ సంకేతాలు ఇచ్చాడు. క్రికెట్‌ వ్యాఖ్యానం కోసం అతడు ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు. అందుకే ‘కేవలం గుర్తుచేస్తున్నా’ అంటూ కిట్‌బ్యాగు, గ్లోవ్స్‌చిత్రాలను ట్వీట్‌ చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని