Equestrian Mirza: గుర్రపు స్వారీలోనూ దక్కని పతకం

తాజా వార్తలు

Published : 02/08/2021 20:33 IST

Equestrian Mirza: గుర్రపు స్వారీలోనూ దక్కని పతకం

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం వస్తుందని ఆశలు రేకెత్తించిన మరో ఈవెంట్‌ ఈక్వెస్ట్రియన్‌. భారత ఆటగాడు ఫవాద్‌ మీర్జా ఫైనల్‌కు అర్హత సాధించినా చివరి పోరులో ఓడిపోయాడు. ఈ క్రీడలో భారత్‌ నుంచి వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌ చేరిన మొదటి ఆటగాడు అతడే కావడం గమనార్హం. అయితే, 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ క్రీడ మొత్తం డ్రెసేజ్‌,  క్రాస్‌ కంట్రీ, జంపింగ్‌ అని మూడు విభాగాలుగా జరుగుతుంది. జర్మీనికి చెందిన క్రజోవోస్కీకి స్వర్ణం దక్కగా, గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన మెక్‌ఇవెన్‌కు రజతం, ఆస్ట్రేలియా ఈక్వెస్ట్రియన్‌ ఎ.హో కాంస్యం దక్కించుకున్నారు. ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్‌లో రెండు దశాబ్దాలుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు ఫవాద్‌ మాత్రమే. ఇంతియాజ్‌ అనీస్‌ (సిడ్నీ 2000),  దివంగత వింగ్‌ కమాండర్‌ ఐజే లాంబా (అట్లాంటా 1996) అంతకుముందు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని