India vs England: లార్డ్స్‌ ప్రత్యేకం అనుకుంటే ఓవల్‌లో అంతకు మించి!

తాజా వార్తలు

Published : 07/09/2021 10:56 IST

India vs England: లార్డ్స్‌ ప్రత్యేకం అనుకుంటే ఓవల్‌లో అంతకు మించి!

భారత జట్టుపై ప్రశంసల జల్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓవల్‌ టెస్టు విజయంతో భారతావని మురిసింది. టీమ్‌ఇండియా ఊహించని రీతిలో విజయం సాధించడంతో అభిమానులు పరవశంలో మునిగిపోయారు. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఆటగాళ్ల ప్రదర్శనను వేనోళ్ల కొనియాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జే షా మొదలుకొని అనేక మంది కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక ఆటగాళ్లు తమ ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

* అటు వ్యాక్సినేషన్‌ ఇటు క్రికెట్‌ పరంగా భారత్‌కిది అద్భుతమైన రోజు. టీమ్‌ఇండియా ఎప్పటిలాగే గొప్ప విజయం అందుకుంది - ప్రధాని నరేంద్రమోదీ

* అద్భుత ప్రదర్శన.. రెండు జట్ల మధ్య నైపుణ్యమే తేడా. అంతకుమించిన తేడా ఏంటంటే టన్నుల కొద్దీ ఒత్తిడిని అధిగమించడం.. మిగతా వాళ్లతో పోలిస్తే భారత క్రికెట్‌ మరెంతో ముందుంది - సౌరవ్‌ గంగూలీ

* టీమ్‌ఇండియా తిరుగులేని విధంగా పుంజుకుంది. దెబ్బతిన్న ప్రతిసారీ కుర్రాళ్లు బలంగా పుంజుకుంటున్నారు. ఆఖరి రోజు ఇంగ్లాండ్‌ 77/0తో ఉన్నప్పుడు ఎంతలా ఆధిపత్యం చెలాయించారో! ఇలాగే ముందుకు సాగండి. సిరీసును 3-1తో గెలవండి - సచిన్‌ తెందూల్కర్‌

* ఇదో ప్రత్యేకమైన టెస్టు విజయం. తొలిరోజు 127/7తో ఉన్నప్పుడు సాధారణంగా ఏ జట్టూ పుంజుకొని గెలవలేదు. టీమ్‌ఇండియా మాత్రం ఈ అద్భుతం చేసింది. అందుకే ఇది ప్రత్యేకమైన భారత జట్టు. చిరస్మరణీయ విజయంలో తమ వంతు పాత్ర పోషించిన కుర్రాళ్లందరికీ అభినందనలు - వీవీఎస్‌ లక్ష్మణ్‌

లార్డ్స్‌ విజయమే ప్రత్యేకం అనుకుంటే ఓవల్‌ గెలుపు అంతకు మించి! టీమ్‌ఇండియా సవాళ్లను ఎదుర్కొని రాటుదేలడం నేర్చుకుంది. జట్టు మొత్తానికి అభినందనలు. టెస్టు క్రికెట్లో వంద వికెట్లు తీసిన జస్ప్రీత్‌ బుమ్రా ప్రయాణం అద్భుతం - జేషా



















Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని