Tokyo Olympics: 28.00 పెనాల్టీస్‌తో నిలిచిన ఫవాద్‌ మిర్జా

తాజా వార్తలు

Published : 30/07/2021 23:33 IST

Tokyo Olympics: 28.00 పెనాల్టీస్‌తో నిలిచిన ఫవాద్‌ మిర్జా

టోక్యో: ఒలింపిక్స్‌లో రెండు దశాబ్దాల తర్వాత ఈక్వెస్ట్రియన్‌గా (గుర్రపు స్వారీ) అర్హత సాధించిన భారత రైడర్‌ ఫవాద్‌ మిర్జా శుక్రవారం తొలి రౌండ్‌ పూర్తి చేసుకున్నాడు. డ్రెస్సేజ్‌గా పిలిచే ఈ రౌండ్‌లో ఫవాద్‌ 28.00 పెనాల్టీస్‌తో ఏడో స్థానంలో నిలిచాడు. ‘సీగ్నర్‌ మెడికాట్‌’ అనే తన గుర్రంపై అతడు ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అయినా ఏడో స్థానంలో నిలిచి అక్కడితో సరిపెట్టుకున్నాడు. ఇక ఒలివర్‌ టోనెండ్‌ అనే రైడర్‌ 23.6 తక్కువ పెనాల్టీస్‌తో అందరికన్నా ముందున్నాడు. కాగా, ఈ పోటీలో మొత్తం 63 మంది పాల్గొనగా శుక్రవారం 42 మందికే అవకాశం దక్కింది. మిగిలిన 21 మంది రైడర్లు శనివారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాగా, డ్రెస్సేజ్‌గా పిలవబడే ఈ క్రీడలో రైడర్లు తమ గుర్రాలను నిర్దిష్టమైన విధంగా నియంత్రిస్తూ, వాటిపై పట్టుసాధిస్తూ నియమాలకు కట్టుబడి స్వారీ చేయాలి. 20x60 మీటర్ల వ్యాసార్థం కలిగిన ప్రదేశంలో అక్కడ మార్క్‌ చేసి ఉన్న ప్రాంతంలోనే గుర్రాన్ని నియంత్రించాలి. అయితే, ఇందులో వ్యక్తిగత ప్రదర్శనలో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి. అందులో డ్రెస్సేజ్‌ తొలి రౌండ్‌ కాగా, రెండోది క్రాస్‌ కంట్రీ అని, మూడోది షో జంపింగ్‌ అని పిలుస్తారు. ఈ మూడు విభాగాల్లో ఎవరైతే తక్కువ పెనాల్టీస్‌తో నిలుస్తారో వారినే విజేతలుగా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలోనే ఫవాద్‌ శుక్రవారం తన రౌండ్‌ పూర్తి చేసుకొని రౌండ్‌ రౌండైన క్రాస్‌ కంట్రీలో ఆగస్టు 1న పోటీపడనున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని