Cricket News: యువీ, మహీ తర్వాత హార్దిక్‌ పాండ్యే!

తాజా వార్తలు

Published : 16/07/2021 17:16 IST

Cricket News: యువీ, మహీ తర్వాత హార్దిక్‌ పాండ్యే!

ప్రమాదకర ఫినిషర్‌ అవుతాడన్న లక్ష్మణ్‌ శివ రామకృష్ణన్‌

ముంబయి: క్రమం తప్పకుండా ఆడితే హార్దిక్‌ పాండ్య జట్టుకు ఆస్తిగా మారతాడని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్ శివ రామకృష్ణన్‌ అన్నారు. అతడు పూర్తిగా ఫిట్‌నెస్‌ సంతరించుకోవాలని సూచించాడు. యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్‌ ధోనీ తర్వాత ప్రమాదకర ఫినిషర్‌గా మారే అవకాశం ఉందన్నాడు.

‘ఫిట్‌నెస్‌ పెంచుకొని బౌలింగ్‌ చేయడం మొదలు పెట్టగానే హార్దిక్‌ పాండ్య కీలకంగా మారతాడు. కొన్నేళ్ల తర్వాత జట్టుకు సమతూకం తెచ్చే పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దొరికాడు. బ్యాటింగ్‌ చేసే ఫాస్ట్‌ బౌలర్లు మనకెవరూ లేరు’ అని శివరామకృష్ణన్‌ అన్నారు.

‘టెస్టు స్థాయిలోనూ మన ఫాస్ట్‌ బౌలర్లు బ్యాటింగ్‌ చేయరు. కానీ హార్దిక్‌ చేయగలడు. మెరుపు వేగంతో పరుగులు చేయడం అతడికి అలవాటు. ప్రత్యర్థిని కకావికలం చేస్తాడు. అందుకే అతడు ఫిట్‌నెస్‌ సంతరించుకుంటే జట్టుకు ఎనలేని ఆస్తిగా మారతాడు’ అని శివరామకృష్ణన్‌ తెలిపారు.

‘యువీ, మహీ తర్వాత టీమ్‌ఇండియా మరో ఫినిషర్‌ కోసం చూస్తోంది. హార్దిక్‌ ప్రమాదకర ఫినిషర్‌గా మారొచ్చు. అతడు బౌలింగ్‌ మొదలు పెడితే ఆత్మవిశ్వాసం పొందుతాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణిస్తాడు. ఆడేకొద్దీ మానసికంగా, సాంకేతికంగా మెరుగవుతాడు. అతడు సామర్థ్యం మేరకు ఆడితే టీమ్‌ఇండియాకు సులభంగా విజయాలు లభిస్తాయి’ అని ఆయన వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని