IPL 2021: వార్నర్‌ ఏం చేస్తాడో..! నేడే దిల్లీతో సన్‌రైజర్స్‌ పోరు

తాజా వార్తలు

Updated : 22/09/2021 10:20 IST

IPL 2021: వార్నర్‌ ఏం చేస్తాడో..! నేడే దిల్లీతో సన్‌రైజర్స్‌ పోరు

దుబాయ్‌: ఐపీఎల్‌ రెండో దశలో బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొననుంది. సాధారణంగా ఇరుజట్లలో ఆటగాళ్ల ఫామ్‌.. బలాబలాలపై చర్చ జరగాలి. కానీ.. ఇప్పుడు అందరి దృష్టి సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పైనే! ఎన్నో ఏళ్లుగా సన్‌రైజర్స్‌ను ఒంటిచేత్తో నడిపించిన వార్నర్‌ ఈ ఏడాది సారథ్యం కోల్పోయి.. తుది జట్టుకూ దూరమయ్యాడు! ఒకదశలో అతను జట్టులో కొనసాగుతాడో? లేదో? అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఐపీఎల్‌లో అనుకోని విరామంతో సమీకరణాలు మారిపోయాయి. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున అత్యధిక పరుగుల వీరుడు జానీ బెయిర్‌స్టో.. యూఏఈ దశకు దూరంగా ఉండటంతో బ్యాటింగ్‌లో మళ్లీ వార్నరే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాడు. ఈ అవకాశాన్ని వార్నర్‌ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని