IND vs ENG: రెండో ఇన్నింగ్స్‌లో నిలబడ్డ భారత్‌.. మూడో రోజు 215/2

తాజా వార్తలు

Published : 28/08/2021 02:17 IST

IND vs ENG: రెండో ఇన్నింగ్స్‌లో నిలబడ్డ భారత్‌.. మూడో రోజు 215/2

లీడ్స్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా మూడో రోజు ఆధిపత్యం చెలాయించింది. ఆట పూర్తయ్యేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 215/2 స్కోర్‌తో నిలిచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(45; 94 బంతుల్లో 6x4), చెతేశ్వర్‌ పుజారా(91; 180 బంతుల్లో 15x4) ధాటిగా ఆడి నాటౌట్‌గా నిలిచారు. మూడో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్‌ రోహిత్‌(59; 156 బంతుల్లో 7x4, 1x6) రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాక వీరిద్దరూ జోడీ కట్టారు. అనంతరం చివరి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అలా ఆట నిలిచిపోయేసరికి 99 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించి భారత్‌ను నిలబెట్టారు. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌(8) ఓవర్టన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కి నిరాశ పరిచాడు. ప్రస్తుతం భారత్‌ 139 పరుగుల వెనుకంజలో నిలిచింది. కాగా, ఇంగ్లాండ్‌ తొలుత 423/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించగా మరో నాలుగు ఓవర్లలోనే 9 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. షమి.. ఓవర్టన్‌(32)ను ఎల్బీడబ్ల్యూ చేయగా, బుమ్రా.. రాబిన్‌సన్‌ను బౌల్డ్‌ చేశాడు. దాంతో ఇంగ్లాండ్‌ 432 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే భారత్‌పై 354 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ రోజు మొత్తంలో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ ఇలాగే ఆడితే మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని