Tokyo olympics: ఆర్చరీ క్వార్టర్స్‌కు భారత్‌.. మళ్లీ కొరియానే ప్రత్యర్థి

తాజా వార్తలు

Published : 26/07/2021 09:42 IST

Tokyo olympics: ఆర్చరీ క్వార్టర్స్‌కు భారత్‌.. మళ్లీ కొరియానే ప్రత్యర్థి

టోక్యో: ఒలింపిక్స్‌ ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అతాను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన బృందం ప్రిక్వార్టర్స్‌లో 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. క్వార్టర్స్‌లో అత్యంత బలమైన, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొరియాతో తలపడనుంది. ఈ పోరులో గెలిస్తే భారత్‌కు కచ్చితంగా పతకావకాశం ఉంటుందని చెప్పొచ్చు!

ప్రిక్వార్టర్స్‌లో భారత్‌ 6-2 తేడాతో కజక్‌స్థాన్‌ను ఓడించింది. టీమ్‌ఇండియా 55-54, 52-51తో తొలిరెండు సెట్లను కైవసం చేసుకొని ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకమైన మూడో సెట్లో భారత్‌ ఒక పాయింటు తక్కువ చేయడంతో నాలుగో సెట్‌కు వెళ్లాల్సి వచ్చింది. కజక్‌ 57 స్కోరు సాధించగా భారత్‌ 56కు పరిమితమైంది. ఇక ఆఖరి సెట్లో భారత్‌ 55-54తో విజయ దుందుభి  మోగించింది. కాగా అంతకుముందు మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ భారత్‌.. కొరియా చేతిలోనే ఓడిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని