INDvsENG: వర్షం కారణంగా ఆటకు అంతరాయం..

తాజా వార్తలు

Updated : 05/08/2021 20:40 IST

INDvsENG: వర్షం కారణంగా ఆటకు అంతరాయం..

అర్ధశతకంతో కొనసాగుతున్న కేఎల్‌ రాహుల్‌

నాటింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రెండో సెషన్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ చేస్తుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం వర్షం నిలిచిపోవడంతో అంపైర్లు మైదానం, వెలుతురును పరిశీలించారు. ఆటకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో కాసేపట్లో మ్యాచ్‌ తిరిగి ప్రారంభమవుతుందని అంపైర్లు తాజాగా వెల్లడించారు. అంతకుముందు భారత్‌ 46.1 ఓవర్లకు 124/4తో నిలిచిన సమయంలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు తొలుత ఆటను నిలిపివేశారు. కాసేపటికే మైదానంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ మరింత ఆలస్యమైంది. అప్పటికి క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (57; 148 బంతుల్లో 9x4) అర్ధశతకంతో కొనసాగుతుండగా.. తోడుగా రిషభ్‌ పంత్‌(7) ఉన్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 58 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. భోజన విరామానికి ముందు 97/1తో పటిష్టస్థితిలో నిలిచిన భారత జట్టు తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. స్వల్ప తేడాలో పుజారా(4), కెప్టెన్‌ కోహ్లీ(0), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(5) ఔటవ్వడంతో భారత్‌ కష్టాల్లో పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని