IND vs ENG: రాహుల్‌ను వెనక్కి పంపిన బెయిర్‌స్టో.. సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ వీడియో అదుర్స్‌!

తాజా వార్తలు

Published : 28/08/2021 02:12 IST

IND vs ENG: రాహుల్‌ను వెనక్కి పంపిన బెయిర్‌స్టో.. సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ వీడియో అదుర్స్‌!

లీడ్స్‌: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(8) మరోసారి నిరాశపరిచాడు. శుక్రవారం మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకు ఆలౌటయ్యాక.. రాహుల్‌, రోహిత్‌(59) బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 19వ ఓవర్ల పాటు ఎంతో ఓపిగ్గా ఆడి 34 పరుగులు జోడించారు. అయితే, ఓవర్టన్‌ వేసిన 18.6 ఓవర్‌కు రాహుల్‌ స్లిప్‌లో దొరికిపోయాడు. ఎడమవైపు వెళ్తున్న బంతిని బెయిర్‌స్టో అమాంతం డైవ్‌చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో భారత్‌ భోజనవిరామానికి ముందు తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తమ ట్విటర్‌లో పంచుకోగా అది అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరూ ఆ వీడియోను చూసి ఆస్వాదించండి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని