INDvsENG: రాణించిన రోహిత్‌, రాహుల్‌.. మరోసారి పుజారా విఫలం

తాజా వార్తలు

Updated : 12/08/2021 21:08 IST

INDvsENG: రాణించిన రోహిత్‌, రాహుల్‌.. మరోసారి పుజారా విఫలం

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో సెషన్‌ పూర్తి చేసుకుంది. తొలి సెషన్‌లో 46/0తో నిలిచిన కోహ్లీసేన రెండో సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి మరో 111 పరుగులు చేసింది. దాంతో మొత్తం 52 ఓవర్లకు 157/2తో పటిష్టస్థితిలో నిలిచింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(83; 145 బంతుల్లో 11x4, 1x6) ఔటైనా కేఎల్‌ రాహుల్‌ (55 నాటౌట్‌; 143 బంతుల్లో 3x4, 1x6) అర్ధశతకంతో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా(9; 23 బంతుల్లో 1x4) మరోసారి నిరాశపరిచాడు. దాంతో భారత్‌ 150 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ క్రీజులోకి రాగా మరో వికెట్‌ పడకుండా భారత్‌ రెండో సెషన్ ముగించింది. కాగా, ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్‌ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని