IPL 2021: అశ్విన్‌ × మోర్గాన్‌ మాటల యుద్ధం

తాజా వార్తలు

Updated : 29/09/2021 10:13 IST

IPL 2021: అశ్విన్‌ × మోర్గాన్‌ మాటల యుద్ధం

(Photos: Ashwin and Morgan Instagram)

షార్జా: దిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిల్లీ ఆటగాడు అశ్విన్, కోల్‌కతా కెప్టెన్‌ మోర్గాన్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆఖరి ఓవర్లో సౌథీ బౌలింగ్‌లో ఔటై వెళ్లిపోతున్న అశ్విన్‌ను మోర్గాన్‌ ఏదో అనడంతో ఆగిపోయాడు. కోపంగా స్పందిస్తూ మోర్గాన్‌ దిశగా వెళ్లాడు. అయితే కోల్‌కతా వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అతణ్ని ఆపి శాంతింప చేశాడు. ఈ గొడవకి కారణం అంతకుముందు ఓవర్లో జరిగిన ఘటన. వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన 19వ ఓవర్‌ చివరి బంతిని పంత్‌.. పాయింట్లోకి షాట్‌ ఆడి సింగిల్‌ తీశాడు. కానీ రాహుల్‌ త్రిపాఠి త్రో చేసిన బంతి పంత్‌ను తాకి దూరంగా వెళ్లడంతో రెండో పరుగు తీశారు. ఇదే మోర్గాన్‌ ఆగ్రహానికి కారణంగా అయ్యింది. అలా రెండో పరుగు చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమన్న ఉద్దేశంతో మోర్గాన్‌ ఉన్నాడని కార్తీక్‌ చెప్పాడు. ‘‘రాహుల్‌ త్రిపాఠి త్రో పంత్‌కు తగిలిన తర్వాత అశ్విన్‌ రెండో పరుగు కోసం పంత్‌ను పిలిచాడు. అది మోర్గాన్‌కు నచ్చినట్లు లేదు. బంతి బ్యాట్స్‌మన్‌కు తగిలి వెళ్లినప్పుడు క్రీడాస్ఫూర్తితో వ్యవహరించి, పరుగు తీయకూడదన్నది అతడి భావన. ఈ విషయంలో నిబంధనలు సరిగా లేవు’’ అని కార్తీక్‌ వివరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని