IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

తాజా వార్తలు

Updated : 28/09/2021 15:12 IST

IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరికాసేపట్లో ఐపీఎల్‌ 41వ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రెండో దశలో మోర్గాన్‌ టీమ్‌ రెండు విజయాలు సాధించి జోరుమీదున్నట్లు కనిపించినా గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకు వెళ్లాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటికే వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌ చేరిన దిల్లీ టీమ్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది.

కోల్‌కతా జట్టు: శుభ్‌మన్‌గిల్‌, వెంకటేశ్ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, దినేశ్‌ కార్తీక్‌, సునీల్‌ నరైన్‌, లాకీ ఫెర్గూసన్‌, టిమ్‌సౌథీ, వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌

దిల్లీ జట్టు: శిఖర్‌ ధావన్‌, స్టీవ్‌స్మిత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్ (కెప్టెన్‌)‌, షిమ్రన్‌ హెట్మెయిర్‌, లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, రబాడ, నోర్జె, అవేశ్‌ ఖాన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని