IPL 2021: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

తాజా వార్తలు

Updated : 26/09/2021 15:14 IST

IPL 2021: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

ఇంటర్నెట్‌డెస్క్‌: పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. రెండో దశలో రెండు జట్లూ ముంబయి, బెంగళూరు జట్లను ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. అయితే, మరికాసేపట్లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, ఇరు జట్లూ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉండటంతో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది.

కోల్‌కతా జట్టు: వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌గిల్‌, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, లాకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ

చెన్నై జట్టు: డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, సామ్‌ కరణ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, జోష్‌ హేజిల్‌వుడ్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని