IPL 2021 - Mumbai Indians: హార్దిక్‌ పాండ్యకు ఏమైంది..?

తాజా వార్తలు

Published : 25/09/2021 09:22 IST

IPL 2021 - Mumbai Indians: హార్దిక్‌ పాండ్యకు ఏమైంది..?

దుబాయ్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. ఐపీఎల్‌ రెండో దశ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. జట్టుకు సమతూకాన్ని తెచ్చే ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అందుబాటులో లేకపోవడం ఆ జట్టును బాగా దెబ్బ తీసింది. అయితే హార్దిక్‌ ఇంకా బరిలో దిగకపోవడం ముంబయికి మాత్రమే కాదు టీమ్‌ఇండియాను కూడా కలవరపరిచే అంశమే. టీ20 ప్రపంచకప్‌ ఎంతో దూరంలో లేని నేపథ్యంలో ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం ఎంతో ముఖ్యం. 2021 ఐపీఎల్‌ ఆరంభంలో శిక్షణలో గాయపడిన పాండ్య.. ఈ సీజన్లో తొలి అంచెలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయలేదు. బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. ప్రపంచకప్‌కు ఎంపికైన ఏ భారత ఆటగాడినీ వందశాతం ఫిట్‌గా లేకుండా ఐపీఎల్‌లో ఆడించకూడదని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సూచించిన నేపథ్యంలో పాండ్యను ముంబయి బరిలో దించట్లేదు. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించేందుకు పాండ్య సమీపంగా ఉన్నాడని ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ చెప్పాడు. ఇటీవల శ్రీలంక వన్డే సిరీస్‌లో 3 వికెట్లే తీసిన పాండ్య.. బ్యాట్‌తో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని