IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం..: విరాట్‌ కోహ్లీ

తాజా వార్తలు

Published : 20/09/2021 01:45 IST

IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం..: విరాట్‌ కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి దశలో ఎలా ఆడామో ఇప్పుడూ అలాగే ఆడతామని.. అంతే ప్యాషన్‌, పట్టుదలతో బరిలోకి దిగుతామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. తొలుత ఏప్రిల్‌ 9న మొదలైన ఈ సీజన్‌ కరోనా విజృంభణ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఆదివారం నుంచి యూఏఈలో తిరిగి ప్రారంభంకానుంది. ఇక ఆర్సీబీ సోమవారం కోల్‌కతాతో తలపడనుంది.

‘తొలి భాగంలో ఆడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ ఇప్పుడు ఆడటం లేదు. వారి స్థానాల్లో శ్రీలంక ఆటగాళ్లు వానిండు హసరంగ, చమీర దుష్మంత జట్టులోకి వచ్చారు. వీరికి యూఏఈ లాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో బాగా తెలుసు. వీళ్ల నైపుణ్యాలు మా జట్టుకు బాగా ఉపకరిస్తాయి. వీరి చేరికతో జట్టు మరింత బలోపేతంగా తయారవుతుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 

‘ఈ టోర్నీలో ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటంతో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచినా ఎనిమిదో మ్యాచ్‌ను కూడా అంతే పట్టుదల, ప్రొఫెషనలిజమ్‌తో ఆడాలి. ఒకవేళ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనా ఆరో మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు కాబట్టి ప్రతీది ఇలాగే జరుగుతుందని ఆశించొద్దు. ఇకపోతే బయట నుంచి అనేక విశ్లేషణలు, సమాచారం, పాయింట్లు.. అనే లెక్కలు ఉంటాయి. వాటిపై ఆధారపడి మ్యాచ్‌లు ఆడలేం. ఆ సమయానికి మనం ఎలా ఉన్నాం, ఎలా స్పందిస్తున్నాం, మన ప్రణాళికలు ఏంటి? వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామా లేదా అనే వాటిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి’ అని కోహ్లీ వివరించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మంచి విజయాలు సాధించామని, ఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుందని కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని