IPL 2021 - Mumbai Indians: మా వైఫల్యం అదే.. అందుకే ఓడిపోయాం: జహీర్‌ ఖాన్‌

తాజా వార్తలు

Published : 28/09/2021 09:07 IST

IPL 2021 - Mumbai Indians: మా వైఫల్యం అదే.. అందుకే ఓడిపోయాం: జహీర్‌ ఖాన్‌

దుబాయ్‌: మిడిలార్డర్‌ వైఫల్యం వల్లే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. ఈ సీజన్‌ ఐపీఎల్‌ రెండో దశ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిందని ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ ఖాన్‌ అన్నాడు. ‘‘రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉంది. ఛేదనలో ఆరంభంలో మా జట్టు బాగానే బ్యాటింగ్‌ చేసింది. కానీ మిడిలార్డర్‌ విఫలం కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. శుభారంభం లభించిన తర్వాత వరుస వికెట్లు కోల్పోతే కోలుకోవడం కష్టం. ప్రస్తుత సీజన్లో ముంబయి పరిస్థితి అంత ఏం బాగోలేదు. ప్లేఆఫ్‌ ఆశలు నిలవాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఇందుకోసం జట్టు కలిసికట్టుగా ఆడాలి. ముంబయి అంటే దూకుడైన ఆటకు పేరు. కానీ ఈ సీజన్లో జట్టులో లోపించింది ఆ దూకుడే’’ అని జహీర్‌ పేర్కొన్నాడు. హ్యాట్రిక్‌ సాధించిన హర్షల్‌ పటేల్‌ అద్భుతంగా బంతులేశాడని.. ముఖ్యంగా స్లో డెలివరీలు వేసి వికెట్లు తీశాడని జహీర్‌ ప్రశంసించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని