Dhoni: ఐపీఎల్‌ 2021 అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది: ధోనీ

తాజా వార్తలు

Updated : 20/08/2021 19:35 IST

Dhoni: ఐపీఎల్‌ 2021 అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది: ధోనీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్ 2021 సీజన్‌ రెండోభాగం మరో నెల రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అందుకు సంబంధించిన ఓ ప్రమోషనల్‌ వీడియోలో అదరగొట్టాడు. అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని పేర్కొంటూ ఓ బాలీవుడ్‌ సినిమా డైలాగ్‌తో కూడిన ప్రచార చిత్రంలో సరికొత్త అవతారంలో కనువిందు చేశాడు. ఐపీఎల్‌ నిర్వాహకులు కొద్దిపేపటి క్రితమే ఆ వీడియోను తమ అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే మిగిలిన 14వ సీజన్‌లో.. డ్రామా, సస్పెన్స్‌, క్లైమాక్స్‌తో పాటు హెలికాఫ్టర్‌ టేకాఫ్‌ కూడా ఉంటుందంటూ అందులో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఈ ఏడాది మే 4న ఐపీఎల్‌ టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులు మళ్లీ సెప్టెంబర్‌, అక్టోబర్‌లో మిగిలిన సీజన్‌ను పూర్తి చేయాలని భావించారు. దాంతో గతేడాది నిర్వహించిన యూఏఈలోనే ఇప్పుడు కూడా మెగా టీ20 లీగ్‌ను కొనసాగించాలని చూస్తున్నారు. మరోవైపు ఈ సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోయేసరికి దిల్లీ క్యాపిటల్స్‌ అందరికన్నా ముందుంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చెరో 5 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. దాంతో మిగిలిన సీజన్‌లోనూ ఈ జట్లు ఇలాగే మంచి విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని