వీడెవడండీ బాబూ! టీమ్‌ఇండియా 12వ ఆటగాడిగా మారిపోయాడు!!

తాజా వార్తలు

Updated : 28/08/2021 13:06 IST

వీడెవడండీ బాబూ! టీమ్‌ఇండియా 12వ ఆటగాడిగా మారిపోయాడు!!

లీడ్స్‌: ఒకవైపు భారత్‌, ఇంగ్లాండ్‌ మ్యాచులు ఉత్కంఠ రేపుతోంటే.. మరోవైపు ఓ ప్రాంక్‌స్టర్‌ మాత్రం అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాడు! భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నాడు! ఇంకా చెప్పాలంటే క్రికెటర్ల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాడు!!

లార్డ్స్‌లో రెండో టెస్టు ఆడుతుంటే ఓ అనూహ్య ఘటన చోటు చేసుకున్న సంఘటన గుర్తుందా? నాలుగో రోజు రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అదే సమయంలో టీమ్‌ఇండియా జెర్సీకిట్‌ ధరించిన ఓ వ్యక్తి మైదానంలో అడుగుపెట్టాడు. సాధారణ ఫీల్డర్లా ప్రవర్తించాడు. అక్కడికి వెళ్లు.. దూరంగా నిలబడు.. అంటూ సైగలు చేసి ఫీల్డింగ్‌ సెట్‌చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ నిజంగానే అతడిని ఆటగాడిగా భావించారు.

నిజం తెలిసిన అభిమానులు మాత్రం స్టాండ్స్‌లో ముసిముసిగా నవ్వుకున్నారు. చివరికి అతడు ప్రాంక్‌స్టర్‌ అని తెలియడంతో జడ్డూ, సిరాజ్‌ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక మైదానం సిబ్బంది అతడిని బయటకు తీసుకువెళ్లడానికి ఆపసోపాలు పడ్డారు.

మూడో టెస్టులోనూ ఆ వ్యక్తి మళ్లీ మైదానంలోకి రావడం కలకలం సృష్టించింది. ‘జర్వో 69’ అనే పేరుతో టీమ్‌ఇండియా జెర్సీని ధరించి అతడు మైదానంలోకి వచ్చాడు. మూడో రోజు ఆటలో రోహిత్‌శర్మ ఔటైనప్పుడు అతడు బ్యాటు పట్టుకొని, హెల్మెట్‌ ధరించి మైదానంలోకి నడిచాడు. ఐతే అతడి ముఖానికి సర్జికల్‌ మాస్క్‌ ఉండటంతో గుర్తించిన సిబ్బంది వెంటనే అతడిని బయటకు తీసుకెళ్లారు. కాగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అతడు మైదానంలోకి ఎలా అడుగు పెడుతున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు!

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని