Ashes Series: అలా కాకుంటే యాషెస్‌కు ఇంగ్లాండ్‌ కష్టమే: పీటర్సన్‌

తాజా వార్తలు

Published : 28/09/2021 09:51 IST

Ashes Series: అలా కాకుంటే యాషెస్‌కు ఇంగ్లాండ్‌ కష్టమే: పీటర్సన్‌

దుబాయ్‌: క్రికెటర్లు బయో బబుల్‌లో ఉన్నది చాలని.. యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ నిబంధనల్ని ఎత్తేయాలని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. డిసెంబరు 8 నుంచి జనవరి 18 వరకు జరిగే యాషెస్‌ సిరీస్‌లో పాల్గొనడంపై ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆసీస్‌లో కఠినమైన క్వారంటైన్‌ నిబంధనల్లో భాగంగా ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యుల రాకపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ‘‘శీతాకాలంలో యాషెస్‌ కోసం ఆసీస్‌కు వెళ్లను. అక్కడికి వెళ్లే అవకాశం సున్నా. అర్థరహితమైన నిబంధనలను ఎత్తేస్తేనే నా కుటుంబం ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రయాణిస్తుంది. ఆటగాళ్లు బుడగలో ఉన్నది చాలు’’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ క్రికెటర్ల కుటుంబ సభ్యుల రాకపై నిషేధాన్ని తొలగించాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌కు బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ విజ్ఞప్తి చేశారు. క్రిస్‌మస్‌ సమయంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం చాలా కష్టమని వివరించారు. 80 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశం ఉన్నందున ఈ ఏడాది ఆఖర్లో క్వారంటైన్‌ ఆంక్షల్ని తొలగించాలని ఆసీస్‌ ప్రభుత్వం భావిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని