INDvsENG: బుమ్రాకు బౌన్సర్లు వేస్తుంటే.. సిల్వర్‌వుడ్‌ ఏం చేస్తున్నాడు?

తాజా వార్తలు

Updated : 22/08/2021 16:08 IST

INDvsENG: బుమ్రాకు బౌన్సర్లు వేస్తుంటే.. సిల్వర్‌వుడ్‌ ఏం చేస్తున్నాడు?

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాకు ఇంగ్లాండ్‌ పేసర్లు వరుసగా బౌన్సర్లు సంధించడంపై ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ స్పందించాడు. ఈ విషయంలో ఇంగ్లాండ్‌ కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ను తప్పుబట్టాడు. మైదానంలో కెప్టెన్‌ జోరూట్‌కు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియనప్పుడు కోచ్‌ అడ్డుకోవాల్సిందని అన్నాడు. వాన్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేస్తూ బుమ్రా విషయంలో ఇంగ్లాండ్‌ ప్రవర్తించిన తీరుపై విమర్శలు గుప్పించాడు. చివరిరోజు భోజన విరామసమయానికి ముందు 20 నిమిషాల ఆటనే ఇంగ్లాండ్‌ వెనుకపడేలా చేసిందన్నాడు.

‘ఐదో రోజు ఆటలో భోజన విరామానికి ముందు 20 నిమిషాల ఆటనే ఇంగ్లాండ్‌ను మ్యాచ్‌లో వెనుకపడేలా చేసింది. కొన్నేళ్లుగా ఇంగ్లాండ్‌ టీమ్‌ ఇలా చేయడం నేనెప్పుడూ చూడలేదు. ఇదో పనికిమాలిన చర్య. బుమ్రాకు బౌన్సర్లు వేసి ఇంగ్లాండ్‌ ఎలా మూల్యం చెల్లించుకుందనే విషయంపై చాలా మంది విమర్శలు చేశారు. కెప్టెన్‌ కూడా తన బౌలర్లను అడ్డుకోలేకపోయాడు. అయితే, ఇక్కడ కోచ్‌ సిల్వర్‌వుడ్‌ కూడా కలగజేసుకుపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. డ్రింక్స్‌ అందించేటప్పుడు కోచ్‌ ఎవరినైనా మైదానంలోకి పంపి బౌన్సర్లు వేయకుండా అడ్డుకొని ఉండాల్సింది. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోలేకపోతే అప్పుడు కోచ్‌గా ఉన్న డంకెన్‌ ఫ్లెచర్‌ నాకు ఇలాగే సందేశాలు పంపేవాడు’ అని వాన్‌ తన పోస్టులో రాసుకొచ్చాడు.

రెండో టెస్టులో బుమ్రా, షమి బ్యాటింగే కీలక సమయమని, అదే సమయంలో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో వెనుకబడిందని అన్నాడు. దాంతో మ్యాచ్‌ గెలిచే అవకాశాన్ని ఇంగ్లాండ్‌ చేజేతులా నాశనం చేసుకుందని చెప్పాడు. ఈ ఓటమికి సిల్వర్‌వుడ్‌ కూడా బాధ్యత వహించాలన్నాడు. ఇక మిగిలిన సిరీస్‌లోనైనా ఇంగ్లాండ్‌ కోచ్‌ తన స్థాయికి తగ్గ మార్పును జట్టులో తీసుకురావాలని కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సరైన పథంలో ముందుకు సాగుతున్నాడని, ఎలాంటి తప్పులు చేయడం లేదని వాన్‌ పేర్కొన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని