Team India: ‘కోహ్లీ’ సేనలో స్పష్టత లేదు

తాజా వార్తలు

Published : 16/07/2021 01:38 IST

Team India: ‘కోహ్లీ’ సేనలో స్పష్టత లేదు

అది మనం అంగీకరించాలి: కైఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ నడిపిస్తున్న టీమ్‌ఇండియాలో సరైన స్పష్టత లేదని మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని మీడియా, అభిమానులు అంగీరించాలని సూచించాడు. జట్టును ఎంపిక చేసే విషయంలో కోహ్లీకి స్పష్టత కొరవడిందని తెలిపాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన కైఫ్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

‘ఈ టీమ్‌ఇండియాలో సరైన స్పష్టత లేదు. అది మనం అంగీకరించాలి. విరాట్ ఇలా ఉండకూడదు. ఆటగాళ్లలో ఎవరు ఫామ్‌లో ఉంటే వాళ్లనే జట్టులోకి తీసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో చివరికి అతడెన్ని  ట్రోఫీలు సాధించాడో అని ప్రశ్నించాల్సి ఉంటుంది. అప్పుడు అతడేం సాధించలేదని తెలుస్తుంది. ఈ జట్టు, యాజమాన్యం.. ఆటగాళ్లు గతంలో ఏం చేశారనేదానికి ప్రాధాన్యత ఇవ్వరు. దాంతో ఈ భారత జట్టులో ఎవరి స్థానమూ కచ్చితం కాదు. అది ఆటగాళ్లకు కూడా తెలుసు’ అని కైఫ్‌ పేర్కొన్నాడు.

అనంతరం తన కెప్టెన్‌ గంగూలీపై స్పందించిన మాజీ బ్యాట్స్‌మన్‌.. దాదా ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించేవాడని చెప్పాడు. అతడు కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో 20-25 మంది మాత్రమే జట్టులోకి అందుబాటులో ఉండేవారని, అప్పుడు ఐపీఎల్‌ లాంటి టోర్నీ లేకపోవడంతో ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పెద్ద తలనొప్పులు ఉండేవి కాదని అన్నాడు. దాంతో గంగూలీ తన సహచరులను బాగా వెన్నుతట్టేవాడని కైఫ్‌ వివరించాడు. అలా ఆటగాళ్లను ఎక్కువ రోజులు ప్రోత్సహించకపోతే కీలక సమయాల్లో రాణించరని విశ్లేషించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని