Naresh Tumda: పాకిస్థాన్‌పై ప్రపంచకప్‌ గెలిచినోడు.. ఇప్పుడు రోజూ కూలీగా మారాడు

తాజా వార్తలు

Updated : 10/08/2021 17:13 IST

Naresh Tumda: పాకిస్థాన్‌పై ప్రపంచకప్‌ గెలిచినోడు.. ఇప్పుడు రోజూ కూలీగా మారాడు

(Photo: Tumda Naresh facebook)

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది కరోనా వైరస్‌ విజృంభణతో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నా ఇంకా చాలా మంది పొట్టకూటికి తిప్పలు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు ఆశతో రోజులు వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిలోనూ ఒక టీమ్‌ఇండియా క్రికెటర్‌ ఉన్నాడు. ఆయనే నరేశ్‌ తుమ్డా. 2018 అంధుల ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతడు ఇప్పుడు బతుకుదెరువు కోసం రోజూ కూలీగా మారాడు.

నరేశ్‌ గుజరాత్‌కు చెందిన ఓ బ్లైండ్‌ క్రికెటర్‌. చిన్నవయసు నుంచే ఆటపై ఆసక్తి చూపడంతో 2014లో ఆ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే 2018లో షార్జాలో జరిగిన బ్లైండ్‌ క్రికెటర్స్‌ ప్రపంచకప్‌లో ఆడాడు. అప్పుడు టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించడంలో నరేశ్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటీ అవకాశం రాలేదని తెలిపాడు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయలు అమ్మినట్లు పేర్కొన్నాడు. అందులోనూ సరైనా ఆదాయం లభించకపోవడంతో ఇప్పుడు కూలీగా మారానన్నాడు. దాంతో రోజుకు రూ.250 చొప్పున సంపాదిస్తున్నానని పేర్కొన్నాడు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తనకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని నరేశ్‌ కోరుతున్నాడు. తన తల్లిదండ్రులు పెద్ద వారయ్యారని, వాళ్లిప్పుడు పనులు చేసే స్థితిలో లేరన్నాడు. దాంతో తానే కుటుంబ పోషణ చూసుకోవాల్సిందని నరేశ్‌ మీడియాతో తన బాధను పంచుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని