Pakistan Cricket: తటస్థ వేదికలు మాకొద్దు: పీసీబీ

తాజా వార్తలు

Published : 25/09/2021 10:38 IST

Pakistan Cricket: తటస్థ వేదికలు మాకొద్దు: పీసీబీ

కరాచి: పాకిస్థాన్‌ ఆతిథ్యమిచ్చే సిరీస్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించబోమని పీసీబీ స్పష్టంచేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల ఆతిథ్యానికి తమ దేశం పూర్తిగా సురక్షితమని పేర్కొంది. ‘‘పాకిస్థాన్‌లో భద్రత పరిస్థితి సాధారణంగానే ఉంది. అంతర్జాతీయ జట్లకు ఆతిథ్యమిచ్చేందుకు అన్ని వసతులు ఉన్నాయి. ఇకమీదట తటస్థ వేదికలు మాకొద్దు’’ అని పీసీబీ అధికారి తెలిపాడు. 2009లో పాక్‌లో శ్రీలంక బృందంపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో పర్యటనకు అన్ని జట్లు విముఖత చూపించాయి. తమ దేశంలో జరగాల్సిన సిరీస్‌లను యూఏఈలో పాక్‌ నిర్వహిస్తూ వచ్చింది. కొన్నేళ్ల తర్వాత మెల్లిగా పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మొదలైంది. పీఎస్‌ఎల్‌ కూడా జరుగుతోంది. అయితే ఇటీవల న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లు తమ పర్యటనల్ని రద్దు చేసుకోవడంతో పాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని