Pro kabaddi: కబడ్డీ.. కబడ్డీ.. రెండేళ్లకు వచ్చేస్తోంది

తాజా వార్తలు

Published : 20/08/2021 11:20 IST

Pro kabaddi: కబడ్డీ.. కబడ్డీ.. రెండేళ్లకు వచ్చేస్తోంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమానులూ సిద్ధంకండి! తొడకొట్టేందుకు ఆటగాళ్లు రెడీ అయ్యారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ కూత పెట్టించేందుకు పీకేఎల్‌ సిద్ధమవుతోంది. రెండేళ్ల తర్వాత ఎనిమిదో సీజన్‌ ఆరంభం కానుంది. ఈ నెలాఖర్లో మూడు రోజుల పాటు భారీ వేలం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

2019, అక్టోబర్లో చివరిసారిగా ప్రొ కబడ్డీ లీగ్‌ సందడి చూశాం. మరికొన్నాళ్లకే కరోనా వైరస్‌ వ్యాపించడంతో క్రీడారంగం స్తంభించిపోయింది. ఎలాగోలా ఐపీఎల్‌ను నిర్వహించినా ఒకర్నొకరు ముట్టుకోవాల్సిన క్రీడ కాబట్టి కబడ్డీ మ్యాచ్‌లు జరగలేదు. ఏడాదిగా అనేక జాగ్రత్తలతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఒలింపిక్స్‌ను జపాన్‌ విజయవంతం చేసింది. దాంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, నిబంధనల మధ్య ప్రొ కబడ్డీ నిర్వహించనున్నారు.

ఆగస్టు 29, 30, 31 తేదీల్లో ఆటగాళ్ల వేలం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే 500 మందితో ఓ జాబితాను సిద్ధం చేశారు. స్థానిక, విదేశీ, కొత్త ఆటగాళ్లను ఏ, బీ, సీ, డీ బృందాలుగా విభజించారు. ఒక్కో విభాగంలో ఆల్‌రౌండర్లు, డిఫెండర్లు, రైడర్లు ఉంటారు. కేటగిరీని బట్టి రూ.30 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు, రూ.6 లక్షలు కనీస ధరగా నిర్ణయించారు. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కోసం రూ.4.4 కోట్లు ఖర్చు చేసుకోవచ్చు.

పీకేఎల్‌ చివరి సీజన్లో ఆడినవారిని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవచ్చు. ఒక్కో జట్టు ఎలైట్‌ రీటెయిన్డ్‌ విభాగం కింద ఆరుగురిని, కొత్త యువ ఆటగాళ్ల విభాగం నుంచి ఆరుగురిని తమవద్దే ఉంచుకోవచ్చు. ఇందుకు కొన్ని షరతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పట్నా పైరేట్స్‌ 3 సార్లు ట్రోఫీ గెలవగా జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, యూ ముంబా, బెంగళూరు బుల్స్‌, బెంగాల్‌ వారియర్స్‌ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఈ ఏడాది డిసెంబర్లో సరికొత్త సీజన్‌ ఆరంభం కానుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని