Rahul Dravid: పిలిస్తే పలికేంత దూరంలో ద్రవిడ్‌!

తాజా వార్తలు

Published : 15/07/2021 01:36 IST

Rahul Dravid: పిలిస్తే పలికేంత దూరంలో ద్రవిడ్‌!

అరంగేట్ర క్రికెటర్‌ కృష్ణప్ప గౌతమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్‌సీయే డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనకు పిలిస్తే పలికేంత దూరంలో ఉంటారని టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ కృష్ణప్ప గౌతమ్‌ అంటున్నాడు. తాను భారత్‌-ఏకు ఆడేటప్పుడు ఆయనే కోచ్‌గా ఉన్నారని తెలిపాడు. ఎలాంటి సందేహం కలిగినా నేరుగా వెళ్లి అడుగుతానని పేర్కొన్నాడు. ఎన్‌సీయేలోనూ ఆయనతో చాలా సమయం గడిపానని వెల్లడించాడు.

‘ద్రవిడ్‌ సర్‌తో కలిసి మళ్లీ పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. టీమ్‌ఇండియాతో నా ప్రయాణం గురించి ఆయనను అడుగుతా. సుదీర్ఘ కాలం, భారీ మ్యాచులు ఆడేందుకు ఒక  క్రికెటర్‌ ఏం చేయాలో ఆయన్నుంచి తెలుసుకుంటా. అన్ని ప్రశ్నలకూ ఆయన సమాధానం చెప్పగలరు’ అని కృష్ణప్ప గౌతమ్‌ అన్నాడు.

టీమ్‌ఇండియా సీనియర్‌ క్రికెటర్లకు గతంలో నెట్స్‌లో బంతులు వేశానని గౌతమ్‌ తెలిపాడు. వారికి బౌలింగ్‌ చేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలిసేవన్నాడు. కోచ్‌ రవిశాస్త్రి సైతం నెట్‌ సెషన్‌ ముగిశాక ప్రత్యేకంగా మాట్లాడేవారని వెల్లడించాడు.

భారత జట్టుకు ఆడాలన్న కల నిజం అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు గౌతమ్‌. కెప్టెన్‌ శిఖర్ ధావన్‌తో చాలాసార్లు మాట్లాడానని, అతడి వ్యక్తిత్వం, వైఖరి తెలుసుకున్నానని చెప్పాడు. ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆడటం అదృష్టంగా పేర్కొన్నాడు. ‘ధోనీ భాయ్‌, నా ఆటను ఎలా ముందుకు తీసుకెళ్లాలి’ అని అడిగితే మహీ విలువైన సలహాలు ఇచ్చాడని తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని