Afghanistan: రషీద్‌ ఖాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ ట్వీటు..! ఎంత ఆవేదనతో చేశాడో!

తాజా వార్తలు

Updated : 19/08/2021 18:23 IST

Afghanistan: రషీద్‌ ఖాన్‌ స్వాతంత్య్ర దినోత్సవ ట్వీటు..! ఎంత ఆవేదనతో చేశాడో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన మాతృభూమి మళ్లీ తాలిబన్ల అరాచక పాలనలోకి జారుకోవడంతో అఫ్గానిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ తల్లడిల్లుతున్నాడు. తన కుటుంబం ఎలావుందోనని బెంగ పడుతున్నాడు. గురువారం అఫ్గాన్‌ స్వాత్రంత్ర్య దినోత్సవం కావడంతో దేశం పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. దేశభక్తుల త్యాగాలను మర్చిపోవద్దని పిలుపునిచ్చాడు.

‘మన జాతికి విలువనిచ్చేందుకు ఈ రోజు కొంత సమయం తీసుకుందాం. అంతేకాదు, దేశభక్తుల త్యాగాలను మర్చిపోవద్దు. మన జాతి ఐక్యతతో వర్ధిల్లాలని, ప్రశాంతంగా ఉండాలని మనమంతా ప్రార్థన చేద్దాం. కోరుకుందాం. స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని రషీద్‌ ట్వీట్‌ చేశాడు. అతడు పోస్టు చేసిన చిత్రాలు హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. అఫ్గాన్‌ జాతీయ పతాకాన్ని చుంబిస్తున్న చిత్రాలను తన బుగ్గలపై అఫ్గాన్‌ పతాకం ముద్రించుకున్న చిత్రాలను అతడు పెట్టాడు.

ప్రస్తుతం అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకం మొదలైంది. అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఊహించిన దానికన్నా ముందుగానే దేశాన్ని ఆక్రమించుకున్నారు. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉన్నారు. కొందరు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మొదట్లో శాంతిమంత్రం జపించిన తాలిబన్లు ఇప్పుడు హింసకు పాల్పడుతున్నారు. మరోవైపు రషీద్‌ లండన్‌లో ది హండ్రెడ్‌ టోర్నీ ఆడుతున్నాడు. తన కుటుంబం అఫ్గాన్‌లోనే ఉండటంతో వారిని ఎలా తరలించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. తన దేశాన్ని కాపాడాలంటూ ప్రపంచనేతలకు అతడు ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని