Rishabh Pant: పంత్‌కు కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Updated : 15/07/2021 12:42 IST

Rishabh Pant: పంత్‌కు కరోనా పాజిటివ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్ఇండియాలో ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. అయితే, అది యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ అని తెలిసింది. ఎనిమిది రోజులుగా అతడు ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉన్నాడని, దాంతో మిగతా ఆటగాళ్లకు కరోనా సోకలేదని బీసీసీఐకు చెందిన అధికారి తెలిపారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 23 మంది ఆటగాళ్ల బృందం గత నెల యూకేకు వెళ్లిన సంగతి తెలిసిందే. కివీస్‌తో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పూర్తయ్యాక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. దాంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో కలిసి నచ్చిన చోటుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలోనే రిషభ్‌ పంత్‌ సైతం ఆ సమయంలో యూరోకప్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు వెళ్లాడు. అక్కడ మాస్క్‌ లేకుండానే ప్రేక్షకుల మధ్య కూర్చొని ఫొటోలు దిగాడు. దాంతో అక్కడే అతడికి వైరస్‌ సోకిందని అనుమానిస్తున్నారు.

మరోవైపు బుధవారంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లకు ఇచ్చిన విశ్రాంతి సమయం పూర్తవడంతో నేడు జట్టంతా కలిసి లండన్‌ నుంచి డరమ్‌ వెళ్లనుంది. అక్కడ వారంతా బయో బుడగలోకి వెళ్లనున్నారు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా.. పంత్‌ పేరు చెప్పకుండా ఒక ఆటగాడికి వైరస్‌ సోకిందని, ఎనిమిది రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ సెక్రటరీ జైషా మిగతా ఆటగాళ్లకు జాగ్రత్తగా ఉండాలని లేఖ రాశారు. టీమ్‌ఇండియా ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుండగా.. అంతుకుముందు డరమ్‌లో కౌంటీ XI జట్టుతో ఒక ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని